| Daily భారత్
Logo




20 మంది పిల్లలను స్టూడియోలో బంధించిన వ్యక్తి పోలీస్ కాల్పుల్లో మృతి

News

Posted on 2025-10-30 14:27:57

Share: Share


20 మంది పిల్లలను స్టూడియోలో బంధించిన వ్యక్తి  పోలీస్ కాల్పుల్లో మృతి

డైలీ భారత్, ముంబాయి:ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్‌ కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడు.

ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్‌ కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. పోవై ప్రాంతంలోని ఆర్‌ఏ స్టూడియోలో యాక్టింగ్‌ క్లాసులు జరుగుతుంటాయి.

కాగా, రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఆ స్టూడియోలో పని చేస్తున్నాడు. అతడికి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉన్నది. గత నాలుగు రోజులుగా రోహిత్ ఆడిషన్లు నిర్వహిస్తున్నాడు. దీంతో గురువారం ఉదయం సుమారు వంద మంది పిల్లలు ఆడిషన్ల కోసం ఆ స్టూడియోకు వచ్చారు. అయితే 80 మంది పిల్లలను అతడు బయటకు వెళ్లనిచ్చాడు. సుమారు 20 మంది పిల్లలను స్టూడియో లోపల ఉంచి నిర్బంధించాడు. దీంతో తమను కాపాడాలంటూ వారు హాహాకారాలు చేశారు.

మరోవైపు రోహిత్‌ ఆర్య ఆ తర్వాత ఒక వీడియో క్లిప్‌ విడుదల చేశాడు. కొంత మంది వ్యక్తులతో మాట్లాడటం కోసమే పిల్లలను బందీలుగా ఉంచినట్లు తెలిపాడు. తనకు పెద్దగా ఆర్థిక డిమాండ్లు లేవని చెప్పాడు. తన డిమాండ్లు నైతికమైనవని అన్నాడు. పోలీసులు, అధికారులు దూకుడుగా వ్యవహరించవద్దని, తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆ ప్రాంగణానికి నిప్పు పెడతానని, తనతో పాటు పిల్లలకు హాని జరుగుతుందని వార్నింగ్‌ ఇచ్చాడు.

కాగా, పిల్లల కిడ్నాప్‌, నిర్బంధం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ స్టూడియో ముందు గుమిగూడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పిల్లలను కిడ్నాప్‌ చేసి నిర్బంధించిన రోహిత్‌ ఆర్యతో మాట్లాడారు.

మరోవైపు పిల్లలందరినీ రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. అతడు ఎందుకు ఇలా చేశాడు అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఆ వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే పోలీస్‌ కాల్పుల్లో గాయపడిన అతడ్ని హాస్పిటల్‌కు తరలించగా మరణించాడు. ఈ సంఘటన ముంబైలో కలకలం రేపింది.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >