| Daily భారత్
Logo




వలపు వల తో ఎనిమిది లక్షల స్వాహా

News

Posted on 2025-10-27 15:09:36

Share: Share


వలపు వల తో ఎనిమిది లక్షల స్వాహా

గొంతు మార్చి, ప్రజలను ఏమార్చి మోసం చేస్తున్న ఘరానా మోసగాడి అరెస్ట్

అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్

రూ 1.5 లక్షలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం

రెండు రోజుల్లో చేదించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు.

నల్గొండలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన జిల్లా పోలీస్

వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి

చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ సెల్

డైలీ భారత్, ఆదిలాబాద్ జిల్లా:స్థానిక ఆదిలాబాద్ ఒకటి ఒకటైన పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికా సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, బాధితుడు తన వివాహానికై ఆన్లైన్ నందు మరియు యుట్యూబ్ నందు వివాహ వధువుల కొరకై శోధిస్తున్న సమయంలో కృష్ణవేణి అనే అమ్మాయి ఫోటోతో యూట్యూబ్ నందు రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి పరిచయమై కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజి అనే మోసగాని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడు మాలోత్ మంజి బాధితున్ని కృష్ణవేణి అనే అమ్మాయి పేరుతో, మహిళ గొంతుతో మాట్లాడి తను ఒక ధనవంతురాలని తన ఆస్తులు కోర్టు నందు చిక్కుకురాయని నమ్మబలికి, లాయర్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా వారి వివాహం తర్వాత తన ఆస్తులను తన వ్యాపారాన్ని బాధితుడు పూర్తిగా చూసుకోవాలి అని చెప్పి, అతని వద్దనుండి విడతలవారీగా ఎనిమిది లక్షల రూపాయలను మోసం చేసి తస్కరించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా తనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయని వాటన్నింటిని నువ్వే చూసుకోవాలని నమ్మించడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంలో మహిళ గొంతుతో మాట్లాడిన ప్రధాన నిందితుడి మోసంలో పడిన బాధితుడు తనకు విడుదలవారీగా ఎనిమిది లక్షలు ఇచ్చి మోసపోవడం జరిగిందని 1930 ద్వారా సైబర్ ఫిర్యాదు చేయగా, ఈనెల 25వ తారీఖున ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ ప్రత్యేక ఆదేశాల మేరకు, సైబర్ సెల్ మరియు వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందం సూర్యాపేట జిల్లా వద్ద నుండి ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మీరు వద్దనుండి ఒకటిన్నర లక్షల రూపాయల నగదు మరియు మూడు మొబైల్స్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో wps ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్ ఐ గోపికృష్ణ, వన్ టౌన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఏ రమేష్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిందితుల వివరాలు...

A1. మాలోత్ మంజి @ కృష్ణవేణి (21) s/o బాలు, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండల్, సూర్యాపేట జిల్లా. 

A2. బుక్య గణేష్ (19) s/o శ్రీను,రామచంద్రపురం తండా, మఠంపల్లి మండల్, సూర్యాపేట జిల్లా.

A3. రూపవత్ శ్రావణ్ కుమార్ (18) s/o శంకర్, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండల్, సూర్యాపేట జిల్లా.

వివరాలలో...

మద్దతు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎం లక్ష్మీకాంత్ ఫిర్యాదు మేరకు ఈనెల 25వ తారీఖున ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.


Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >