| Daily భారత్
Logo




కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్

News

Posted on 2025-10-27 14:59:15

Share: Share


కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల రౌడీషీటర్ రియాజ్ చేతిలో మృతి చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోట్ కుటుంబాన్ని సోమవారం సాయంత్రం నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఎంపీ ధైర్యం చెప్పారు. ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రమోట్ కుటుంబ సభ్యులను కోరారు. అదేవిధంగా రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం కింద అందజేశారు. అలాగే ప్రమోద్ పెద్ద కుమారుడు ఓ ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్న నేపథ్యంలో పుస్తకాలు, నోటుబుక్కులకు అలాగే ట్యూషన్ ఫీజులకు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఉచితంగా అందించాలని ఆ విద్యాసంస్థకు కోరినట్లు వారు కూడా మానవతా దృక్పథంతో ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అలాగే ప్రమోద్ రెండవ కుమారుడు కి కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తానే సీటు కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రమోద్ లేని లోటు  ఆయన అన్నారు ఏది ఏమైనా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ను అత్యంత నేరస్తుడైన  అయిన రియాజ్ అత్యంత కిరాతకంగా హత్య చేయడం దుర్మార్గమైన చర్యాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రియాజ్ లాంటి నేరచరిత్ర కలిగిన వారికి తగిన శిక్ష పడేటట్లు చూడాలన్నారు. అది మరవకముందే హైదరాబాద్లో ఓ డిసిపి పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని కూడా గుర్తించి తగు విధంగా శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ స్థాయి ఉన్నత పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి వహించి ప్రజలు స్వేచ్ఛగా సమాజంలో తిరిగేలా చూడాలని ఆయన కోరారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >