| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పారదర్శకంగా మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా

పారదర్శకంగా మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా

మైనర్లకు లిక్కర్ విక్రయించవద్దు

నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహించాలి

ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

ఐడీఓసీలో A4 మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా పారదర్శకంగా నిర్వహించామని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. 

జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపుల టెండర్ల ఓపెన్ డ్రా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీ లకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని వెల్లడించారు. సెప్టెంబర్ 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టామని, దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23వ తేదీ వరకు స్వీకరించామని తెలిపారు. మొత్తం దరఖాస్తులు 1381 వచ్చాయని వెల్లడించారు. 

డిసెంబర్ 01 వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించాలని ఆదేశించారు. షాపులకు సంబంధించిన లైసెన్స్ ఫీజు చెల్లించాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐలు శ్రీనివాస్, రాజేశ్వర్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Next కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్
ADVERTISEMENT