| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా నూడ పరిధిలో 22 కోట్ల 69 లక్షల 36 వేల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా నూడ పరిధిలో 22 కోట్ల 69 లక్షల 36 వేల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ,ఎమ్మెల్సీ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ  నియోజకవర్గంలో పర్యటించి గౌతమ్ నగర్, ఉర్దూ పాఠశాల సమీపంలో 3కోట్ల46 లక్షలతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనుల కోసం శంకుస్థాపన, ఏల్లమ్మ గుట్ట 1కోటి 19 లక్షల80 వేల రూపాయలతో సీసీ రోడ్ పనుల కోసం శంకుస్థాపన, రేడియో స్టేషన్ సమీపంలో న్యాల్కల్ రోడ్ లో 3కోట్ల46 లక్షల 60 వేల రూపాయలతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ మరియు సి సి  రోడ్ పనుల శంకుస్థాపన, ఉర్దూ గర్ల్స్ జూనియర్ కాలేజ్, మలపల్లి 37 లక్షలతో కాలేజ్ అభివృద్ధి పనుల కోసం  శంకుస్థాపన, 2 కోట్ల 24 లక్షల 87 వేల రూపాయలతో ధర్మపురి హిల్స్ స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనుల కోసం శంకుస్థాపన, కోటి 39 లక్షల 70 వేల రూపాయలతో హబీబ్ నగర్, బోధన్ రోడ్ స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనుల కోసం శంకుస్థాపన, 4కోట్ల 40 లక్షల 50 వేల రూపాయలతో తీన్ కమాన్, నిజాం కాలనీ, అర్సాపల్లి

స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనుల కోసం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అభివృద్ధికి మారుపేరు అని  స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల్లో నిజామాబాద్ నగర అభివృద్ధికి నోచుకోలేదన్నారు.కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేశారు గానీ ప్రజలకు పనికి వచ్చే పనులైతే చేయలేదని విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( నూడ ) నుండి గురువారం నిజామాబాద్ నగరంలో దాదాపు 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల నుండి తేరుకుని వారు చేసిన విచ్ఛిన్న పాలనను సరిదిద్దుతూ పాలను గాడికి తెచ్చాం అన్నారు. విద్యా వైద్యానికి ప్రత్యేక దృష్టి సారించామని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్, వ్యవసాయ కాలేజ్ ను తీసుకువచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. నిజామాబాద్ పట్టణంలో స్థలం సేకరించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ త్వరలో నిర్మిస్తున్నాం అని తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు రైతులకు రైతు భరోసా, పేదలకు సన్న బియ్యం అర్హులకు రేషన్ కార్డు అందిస్తున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నమన్నారు. పేదల సంక్షేమానికి బాటలు వేస్తున్నాం అన్నారు.

Previous కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఉదంతం మరిచిపోలేనిది
Next కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ADVERTISEMENT