| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమోద్ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు లక్షల రూపాయలు అందించిన షబ్బీర్ అలీ  మహేష్ కుమార్ గౌడ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.

ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు పరిహారం కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం నిజామాబాద్ పట్టణంలో 300 గజాల ఇంటి స్థలం అందిస్తున్నామన్నారు. ఆర్థికంగా సహాయం చేయగలం కానీ వారి కుటుంబానికి మానసికంగా జరిగిన గాయాన్ని ఎవరు పూడ్చలేరన్నారు. ప్రమోద్ కుటుంబానిక ఎల్లవేళలా అండగా ఉంటాం అన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్‌లో రౌడీషీటర్ దాడిలో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు వర్గాల్లో కొంతమేర ఉపశమనం కలిగించిందన్నారు. ప్రమోద్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన త్యాగం పోలీసు శాఖ గౌరవాన్ని పెంచి ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెరిగిందన్నారు. పోలీస్ శాఖ సిబ్బంది భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు పోలీసులకు ప్రభుత్వం నైతిక బలం అందిస్తుందన్నారు. ప్రమోద్ కుటుంబానికి అందించే ఈ సాయం ఆయన చేసిన సేవలకు ప్రభుత్వ గౌరవ సూచకమని, ఇది పోలీసు శాఖలో ప్రతి సభ్యుడికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రమోద్ త్యాగం పోలీసు వ్యవస్థలో కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు.

Previous కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా నూడ పరిధిలో 22 కోట్ల 69 లక్షల 36 వేల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Next నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో పేకాట ఆడుతున్న 138 మంది పై కేసులు నమోదు
ADVERTISEMENT