| Daily భారత్
Logo




దేశ రాజధానిలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్‎స్టర్లు హతం

News

Posted on 2025-10-23 12:00:43

Share: Share


దేశ రాజధానిలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్‎స్టర్లు హతం

డైలీ భారత్, న్యూఢిల్లీ:బిహార్‌కు చెందిన ప్రమాదకర సిగ్మా గ్యాంగ్‌ లోని నలుగురు గ్యాంగ్‌స్టర్‌లను దిల్లీ, బిహార్ పోలీసుల సంయుక్త టీమ్ ఎన్‌కౌంటర్ చేసింది. గురువారం తెల్లవారుజామున దిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం తెల్లవారుజామున 2.20 గంటలకు దేశ రాజధానిలోని బహదూర్ షా మార్గ్‌లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ చౌక్, పన్సాలీచౌక్‌లలో పోలీసుల టీమ్, సిగ్మా గ్యాంగ్‌ సభ్యుల మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో రంజన్ పాఠక్ (25), బిమ్లేశ్ మహతో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) హతమయ్యారు. వీరిలో అమన్ ఠాకూర్ దిల్లీలోని కరవల్ నగర్‌ వాస్తవ్యుడు. మిగతా ముగ్గురు గ్యాంగ్‌స్టర్‌లు బిహార్‌లోని సీతామర్హి‌వాసులు.

పోలీసులు చుట్టుముట్టగానే కాల్పులు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు సిగ్మా గ్యాంగ్‌ సభ్యులు కుట్రపన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బిహార్, దిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ సంయుక్త టీమ్‌ను ఏర్పాటు చేసి సిగ్మా గ్యాంగ్‌ సభ్యుల జాడను గుర్తించారు. పోలీసులు చుట్టుముట్టగానే నలుగురు గ్యాంగ్‌స్టర్‌లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులూ ప్రతి కాల్పులు జరిపారు. 15 నిమిషాల పాటు ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. నలుగురు గ్యాంగ్‌స్టర్లకు బుల్లెట్లతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రోహిణి ఏరియాలోని డాక్టర్ బీఎస్‌ఏ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే అప్పటికే ఆ నలుగురు చనిపోయారని వైద్యులు చెప్పారని పోలీసు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్యాంగ్‌స్టర్ల కాల్పుల్లో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు గ్యాంగ్‌స్టర్లు పలు హత్యలు, ఆయుధాలతో బెదిరించి లూటీలకు పాల్పడిన కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారని దిల్లీ క్రైం బ్రాంచ్ డీసీపీ సంజీవ్ యాదవ్ వెల్లడించారు. ఈమేరకు అభియోగాలతో బిహార్‌లోని దుమ్రా, చరౌత్, గహ్రా, పూర్ణహియా ప్రాంతాల్లో వారిపై కేసులు ఉన్నాయని తెలిపారు. బిహార్‌లోని బ్రహ్మశ్రీ సేన నాయకులు గణేశ్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్యసింగ్‌ల హత్యల్లోనూ సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉందన్నారు. ఈ గ్యాంగ్‌స్టర్లు హతం కావడంతో బిహార్, దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పలు పెద్ద నేరపూరిత చర్యల కుట్రలు భగ్నం అయ్యాయని ఆయన చెప్పారు.

ఆయుధాలు స్వాధీనం

ఘటనా స్థలం నుంచి సెమీ ఆటోమేటిక్ జిగానా పిస్టల్ సహా అక్రమ ఆయుధాలు, పెద్దఎత్తున మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ పోలీస్, బిహార్ పోలీస్‌కు చెందిన సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఫోరెన్సిక్, క్రైమ్ సీన్ ఎగ్జామినేషన్ టీమ్‌లను పిలిపించి ఆధారాలను సేకరించారు.

రాంచీలో ఓ మహిళ సహా ఐదుగురు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్

కోయ్లాంచల్ శాంతి సేన (కేఎస్ఎస్) అనే గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు గ్యాంగ్‌స్టర్లను ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ గ్యాంగ్ సభ్యుల కదలికలపై నిఘా వర్గాల నుంచి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిప్రకారం రాంచీలోని బీఐటీ మెస్రా పోలీసు స్టేషన్ పరిధిలోని చుటు ఓవర్ బ్రిడ్జి సమీపంలో నలుగురు పురుష గ్యాంగ్‌స్టర్లను అదుపులోకి తీసుకున్నారు. రాంచీలోని అర్గోరా పోలీసు స్టేషన్ ఏరియాలో మహిళను అరెస్టు చేశారు. ఆమెను కోయ్లాంచల్ శాంతి సేన నేత సుజీత్ సిన్హా భార్య రియా సిన్హాగా గుర్తించారు. ఈ ఐదుగురి నుంచి పాకిస్థాన్‌లో తయారైన 3 పిస్టల్స్, 7 మేగజైన్లు, 13 కార్ట్ రిడ్జ్‌లు, ఒక ఫోర్ వీలర్, 6 మొబైల్ ఫోన్లు, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో రాంచీలోని తుపుదానా పోలీసు స్టేషన్ ఏరియాలో తుపాకీ కాల్పుల ఘటన ఒకటి జరిగింది. ఆ సందర్భంగా పలువురు నేరగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కాల్పులకు పాల్పడింది తామేనని అప్పట్లో కోయ్లాంచల్ శాంతి సేన ప్రకటించుకుంది. దీనిపై రాంచీ పోలీసులు దర్యాప్తు చేయగా కోయ్లాంచల్ శాంతి సేన నేత సుజీత్ సిన్హాకు ప్రస్తుతం యూఏఈలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ ప్రిన్స్ ఖాన్‌తో లింకులు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు సుజీత్ సిన్హా భార్యను, అతడి నలుగురు అనుచరులను అరెస్టు చేశారు


#sigma gang #Delhi #bhihar 

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >