Posted on 2025-10-22 20:20:52
ఆరు గ్యారంటీలే.. కాంగ్రెస్ పార్టీని అంతం చేస్థాయ్
బారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు ఖాయమని, భారాస లీగల్ సెల్ జిల్లాకన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో భాగ్యనగరంలో భాగ్యవంతులు భారీ పెట్టుబడులు పెట్టేటట్లు చేసిందని ఆయన తెలిపారు. హైదరాబాద్, సైబరబాద్, సికింద్రాబాద్ లలో ప్రగతిశీలక పథకాలకు వన్నెలద్ది వన్నెతెచ్చారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి నమూనాలో నూతన ఒరవడులు కేసీఆర్ దిద్దారని మధు వివరించారు. గత శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ నగరంలోని ఇరవై నాలుగు శాసనసభ స్థానాలు గెలుచుకోవడంలోని గొప్పతనం కనబడుతున్నదని విశ్లేశించారు.ఆరు గ్యారంటీలు అంటు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం చూసిన ప్రజలు, ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారాస గెలువబోతున్నాదని తెలిపారు. భారాస లీగల్ సెల్ న్యాయవాద బృందాలు భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపులో భాగస్వాములు కాబోతున్నాయని మధుసుధన్ రావు తెలియజేశారు.కాంగ్రెస్, బిజెపి లు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చెదలు అని వాటిని వదిలించుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలు శ్రీకారం చుట్టబోతున్నారని ఆయన అన్నారు.హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ఫ్లైఓవర్ ల నిర్మాణాలు నిర్మించిన, కష్టాలను దూరం చేసింది యువ నాయకత్వమైన కేటీఆర్ అనే సంగతిని గల్లీ గల్లీలో గుర్తు చేసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ప్లైఓవర్లతో ఈతిభాదలు తీర్చొందే భారాస అనే భరోసాతో ప్రజలు ఉన్నారని, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధి మూట రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కనపడి,జూబ్లీహిల్స్ జిలేబి మూట విప్పి, గులాబీ గెలుపుకు బాట వేయబోతున్నదని మధుసుధన్ రావు తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >