Posted on 2025-10-22 20:19:46
డైలీ భారత్ న్యూస్ నిజమాబాద్: తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కలిసి అమరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులతో ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రభుత్వం నుండి సహాయ సహకారం కావాల్సిన ఇంకా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నను తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారి బాగోగులను పర్యవేక్షించాలని తెలిపారు. వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని మరియు ఎలాంటి సమస్యలు ఉన్నను నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏ సి.పి రాజ వెంకటరెడ్డి, ,ఎన్.ఐ.బి ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఆరిఫ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకిల్ పాషా, సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >