Posted on 2024-01-04 10:38:11
డైలీ భారత్, హైదరాబాద్: స్కూల్ బస్సును నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కండీషన్ లేని బస్సులపైనా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బస్సు డ్రైవర్లపైనా, వారిని కిరాయికి తీసుకున్న స్కూల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకుంటున్న డ్రైవర్ల ధోరణి మాత్రం మారడం లేదు.
డ్రైవర్ల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఉస్మాని యా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హబ్సిగూడ రవీంద్రనగర్ లో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది.
హబ్సిగూడ రవీంద్రనగర్‌లో నేటి ఉదయం తమ బాబు ని జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా, పక్కనే అమ్మమ్మ చేతిలో ఉన్న రెండేళ్ల చిన్నారి కిందికి జారి తెలియకుండానే బస్ టైర్ కిందకి పడిపోయింది.
అమ్మమ్మ చూసే లోపే ఘోరం జరిగిపోయింది. బస్సు ఆపాలని పిలిచేలోపే చిన్నారిపై బస్సు టైరు వెల్లింది పాప టైరు కింద ఉండటంతో.. బస్ డ్రైవర్ గమనించలేదు, బస్‌ను ముందుకు తీయడంతో చిన్నారి టైర్ కింద పడి అక్కడికక్కడే చనిపో యింది.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని, కుటుంబ సభ్యులు ఆందోళన చేప ట్టారు. విషయం తెలుసు కున్న ఓయూ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీకి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >