డైలీ భారత్, మంచిర్యాల: జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా, మంచిర్యాల జిల్లాలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం నస్పూర్ కలెక్టరేట్‌లో టీకాలకు సంబంధించిన గోడ ప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 15 నుండి నవంబర్ వరకు ప్రతి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 4 నెలలు దాటిన ప్రతి పశువుకు ఈ టీకాలు ఉచితంగా అందించాలని తెలిపారు.
News
మంచిర్యాల: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందించాలి