| Daily భారత్
Logo




సహచర మంత్రులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం

News

Posted on 2025-10-15 19:41:31

Share: Share


సహచర మంత్రులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం

కర్నూలులో ప్రధాని పర్యటన ఏర్పాట్లు జోరుగా

డైలీ భారత్, కర్నూలు:ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా జరుగుతున్న “సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, అలాగే కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అత్యంత శ్రద్ధగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఒకే బృందంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణ నుండి సభా ప్రాంగణం వరకు అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభ దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజల ముందుంచే వేదిక. ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా మమేకమవుతారు. అందువల్ల ఈ సభను చారిత్రాత్మకంగా మార్చాలన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లి సభ విజయవంతం కావడంలో పాత్ర వహించాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ప్రజల్లో ఉత్సాహం నింపి, ప్రధానమంత్రికి అద్భుత స్వాగతం పలుకుదాం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సభగా నిలవాలని అన్నారు.

తదుపరి, సభా ప్రాంగణం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, నీటి సదుపాయం, మీడియా సౌకర్యాలు, వాలంటీర్ వ్యవస్థ వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి మరో కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుంది. ఈ కార్యక్రమం కేవలం ఒక సభ కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి యాత్రకు నూతన దిశా నిర్దేశం చేసే ఘట్టం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ విజయవంతం కోసం అందరూ ఒకే తాటిపై నిలిచి, సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >