| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల

డైలీ భారత్, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల రాజ కీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల గురు వారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ మేరకు షర్మిల, మరికొందరు నేతలు బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. కాగా.. ముందుగా షర్మిల.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు.

ఆ తర్వాత వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించు కునేలా బాధ్యతలు ఇవ్వనున్నారు

Previous అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సిఎస్ శాంతి కుమారి
Next తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ADVERTISEMENT