| Daily భారత్
Logo




ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్‌

News

Posted on 2025-10-13 12:24:31

Share: Share


ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్‌

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో బోగస్‌ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్‌పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశించారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్‌ కృష్ణానగర్‌ బీ-బ్లాక్‌లో బూత్‌ నంబర్‌ 246లోని ఓటరు జాబితాను బీఆర్‌ఎస్‌ బూత్‌ ఇన్‌చార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా? లేరా? అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. 8-3-231/బీ/160 నంబర్‌తో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఓటర్లున్నారు. వారంతా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారా? లేరా? అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాలోని ఓటర్‌ క్రమసంఖ్య 1006 నుంచి 1048 వరకు ఉన్న 43 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారెవరూ అక్కడ లేరని తేలింది.

ఐదు అంతస్తులతో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 15 ఫ్లాట్లు ఉండగా వాటిలో మూడు ఫ్లాట్లు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరో 12 ఫ్లాట్లలో ఉంటున్నవారిని వాకబు చేయగా తాము సంవత్సర కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పారు. వారిలో కొంతమంది ఓట్లు ఏపీలో ఉన్నాయని, మరికొందరు తమకు వేరే నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని తెలిపారు. మిగతా వారు గతంలో అక్కడ నివసించి ఉంటారని అనుకుంటే, ఆ అపార్ట్‌మెంట్‌ కట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్నవారే మొదటి నుంచీ అక్కడ ఉంటున్నట్టు తేలింది. అపార్ట్‌మెంట్‌ స్థానంలో గతంలో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేదని, అందులో 40 మందికి పైగా ఉండే అవకాశమే లేదని స్థానికులు చెప్తున్నారు.


#hyderabad #jublihills #elections 

Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >