Posted on 2025-10-10 18:06:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని జిల్లా కేంద్రంలో గల జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయభాస్కరరావు పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సెల్ఫోన్ అనేది అందరికీ సమస్యగా మారిందని ఫోనులో నెగిటివ్ కాంటెంట్ చూస్తే మెదడు నెగిటివ్గా మారుతుందని పాజిటివ్ కాంటెంట్ చూస్తే మెదడు పాజిటివ్గాఫోన్ మారుతుందని ఆయన చెప్పారు ముఖ్యంగా పిల్లలలో సెల్ ఫోన్ ప్రభావం అధికంగా ఉందని వారికి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని కావున తల్లిదండ్రులు వారి సమస్య ప్రారంభ దశలోనే డాక్టర్లకు చూయించి వారికి చికిత్స పొందాలని ఆయన కోరారు. అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లకు వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయని, వారికి అండగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిలుస్తుందని,మహిళా సెక్స్ వర్కర్లకు సుమారు 250 మందికి ప్రతినెల ఉచితంగా ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. అదేవిధంగా మానసిక వికలాంగుల పిల్లలు సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు అని కావున వారిని సరైన సమయంలో మానసిక వైద్య నిపుణులకు చూయించి వారికి కావాల్సిన చికిత్సను పొంది వారి భవిష్యత్తు కోసం అవసరమైన సేవలను పొందాలన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం అనేది నేటి సమాజంలో అందరికీ అవసరమే అన్నారు. మానసిక సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అశ్రద్ధ చేయకుండా వైద్య నిపుణుల సహాయాన్ని తీసుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో చాలా అపోహలు ఉన్నాయని అపోహలను తొలగించుకొని ప్రత్యేక చికిత్స పొందినట్లయితే పూర్తి ఆరోగ్యంగా మారవచ్చున్నారు నేటి సమాజంలో చాలామంది యువత కల్తీకల్లుకు బానిసై అది మానేయగానే ఫిట్స్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని దీన్ని ఏదో పెద్ద వ్యాధిగా భావించకుండా త్వరగా మానసిక వైద్య నిపుణులు సంప్రదించి ఆరోగ్య సంబంధ చికిత్స, సూచనలు పొందాలన్నారు. మానసిక వికలాంగుల కోసం
జిల్లాలో స్నేహ సొసైటీ చాలా కృషి చేస్తుందని వారిని ఆయన అభినందించారు. మానసిక వికలాంగులకు విద్య,వైద్య సౌకర్యాలు అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ, డిచ్పల్లి సిడిపిఓ జ్యోతి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ, అడ్వకేట్ ఆశా నారాయణ, స్నేహ టి ఐ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు, మానసిక వికలాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు, మహిళా సెక్స్ వర్కర్లు, స్నేహ టి ఐ సిబ్బంది, ప్రత్యేక పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >