| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి లక్ష్మీనరసమ్మకు నివాళులు అర్పించిన సీఎం

రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి లక్ష్మీనరసమ్మకు నివాళులు అర్పించిన సీఎం

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఓదార్చిన ముఖ్యమంత్రి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ గత నెల 29న మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలో తలపెట్టిన తన తల్లి ద్వాదశదినకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీనరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేను పరామర్శించి ఓదార్చారు. తన తల్లి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరని ఎందరు ఉన్న ఎంత ఆస్తులు అధికారం పదవులు ఉన్న తల్లి లేకపోతే ఆ మనోవేదన ఏంటో అనుభవించిన వారికి తెలుసు అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హుందాన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూఢ చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Previous జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా అధికార సంస్థ, స్నేహ సొసైటీ రీ కన్స్ట్రక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
Next ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ కార్యవర్గం సభ్యులు
ADVERTISEMENT