డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు నాశెట్టి సుమన్ ఇతర కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వాటిని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా ఉండేందుకు ఉద్యోగులందరం ఐక్యమత్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి కి తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలు వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన వసతులు సక్రమంగా సమయానుసారంగా విడుదల చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రెవెన్యూ ఫోరం జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, రెవెన్యూ ఫోరం జిల్లా సహాధ్యక్షులు శ్రీనివాస్ రావు, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, ఇందిర,శ్రీవేణి, విజయలక్ష్మి, సునీల్,స్వామి, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, సలహాదారుల వనమాల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
News
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ కార్యవర్గం సభ్యులు