డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జూలూరుపాడు, ఏన్కూర్, వైరా, కొనిజర్ల, కారేపల్లి, మరియు ఉమ్మడి జిల్లాల్లో రోడ్లు అంతర్గత స్థితిలో ఆర్ అండ్ బి, బీటీ రోడ్లు, పంట పొలాలకు వెళ్లే రహదారులు కూడా ఇదే విధంగా ఉన్నాయి గెలిచినటువంటి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లు తన కార్యకలాపాలు కొనసాగించుకుంటూ ముందుకు సాగుతున్నారు మండల లీడర్షిప్ నుండి గ్రామస్థాయి లీడర్షిప్ వరకు తమ జేబులో నింపుకుంటున్నారు కనీసం పేదవారికి అందాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందలేకపోతున్నాయి గ్రామస్థాయి నుండి మండల స్థాయి నియోజకవర్గస్థాయి వరకు జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకపోవడం సిగ్గుచేటు ఇదేమని అడిగితే ప్రజలపై పొలిటికల్ లీడర్ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ పెట్టటం జూలూరుపాడు మండలంలో 24 గంటలు రాత్రి పగలు లేకుండా సీతారామ ప్రాజెక్టు మట్టి తోలకాలు ఏదేచ్ఛగా కొనసాగుతున్నాయి ఇదేమని అడిగితే మాకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయంటూ రెచ్చిపోతున్న బడా బాబులు ఇకనైనా అధికారులు మేల్కొని గ్రామస్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు రోడ్లు మరమ్మతులు గ్రామాలలో మంచినీటి సదుపాయాలు వీధిలైట్లు సమకూర్చాలని ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం అధికారులు మేలుకొని ప్రజలు సమస్యలు తీర్చాలని ఓటర్లువేడుకుంటున్నారు
News
అంతర్గత రోడ్లు నిర్మాణం పనుల్లో జాప్యం వైరా నియోజకవర్గంలో ఇదే పరిస్థితి