Posted on 2025-10-10 09:52:38
600 మంది పోలీసుల నిఘా లో ప్రత్యేక బందోబస్తు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శ్రావ్య గార్డెన్ లో సిబ్బందితో తమ తమ విధుల నిర్వహణ కోసము ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని , సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసిన త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని , ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని ఆదేశించారు. అనునిత్యము సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు. సీఎం పర్యటన బందోబస్తుకు 600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. ఇట్టి బ్రీఫింగ్ సందర్భంగా అదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి , నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ , సిసిఎస్ , సి టి సి , ట్రాఫిక్ ACP లు రాజా వెంకటరెడ్డి , వెంకట్ రెడ్డి ,శ్రీనివాస్ నాగేంద్ర చారి , రాజశేఖర్ ,మస్తాన్ అలీ సీఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >