| Daily భారత్
Logo




కామారెడ్డి పోలీసుల వినూత్న ఆలోచన..

News

Posted on 2025-10-09 21:33:09

Share: Share


కామారెడ్డి పోలీసుల వినూత్న ఆలోచన..

మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు స్పెషల్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజు 58 వ్యక్తులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి  జిల్లాలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ప్రధాన కారణమవుతున్నారు. కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపినవారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా, ఎన్నో కుటుంబాలు దాని వల్ల రోడ్డున పడుతున్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, కామారెడ్డి జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వాహనదారులను కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయమూర్తుల ఎదుట హాజరుచేయడం ద్వారా జైలు శిక్షలు లేదా జరిమానాలు విధించడం జరుగుతోంది.

ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు మొత్తం 58 మందికి శిక్షలు విధించింది.దేవునిపల్లి PS లో 10 మందికి జైలు శిక్ష (4 మందికి 2 రోజుల జైలు, 6 మందికి 1 రోజు జైలు , ₹1000 జరిమానా ఒక్కోరికి, దోమకొండ PS లో ఒక వ్యక్తికి 2 రోజుల జైలు + ₹1000 జరిమానా,మాచారెడ్డి, కామారెడ్డి, బిక్నూరు PS లో ఒక్కొక్కరికి 1 రోజు జైలు + ₹1000 జరిమానా,

 కామారెడ్డి లో 14 మంది, రామారెడ్డి 1 వ్యక్తి, దేవునిపల్లి 20 మంది, బిక్నూరు: 1 వ్యక్తి, దోమకొండ 6 మంది, రాజంపేట్ 1 ,  సదశివ నగర్ 1 వ్యక్తి, మొత్తం 44 మందికి ₹1000 చొప్పున జరిమానా విధించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ,మీ కుటుంబాన్ని, ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించి వాహనం నడపవద్దు. మీ నిర్లక్ష్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొందరు వికలాంగులై జీవితాంతం బాధపడుతున్నారు. ఇకనైనా వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపకూడదు. మీరు గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్‌పీ  తెలిపారు.

Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >
Image 1

పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

Posted On 2026-06-25 12:45:33

Readmore >
Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >
Image 1

మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు

Posted On 2026-06-25 12:21:26

Readmore >
Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >