Posted on 2026-05-04 05:24:09
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం బయటపడింది
డైలీ భారత్, హైదరాబాద్: నిఝాంపేట్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి దొప్పలపూడి రవీంద్ర తనకు 1983లో కొనుగోలు చేసిన రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 404, 405 లోని ప్లాట్ నం.108 (300 గజాలు) పై ఇతరుల పేర్లతో నకిలీ సేల్ డీడ్లు నమోదయ్యాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది.
విచారణలో నిందితులు ఖాళీగా ఉన్న ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని అసలు యజమాని లేరని భావించి నకిలీ లింక్ డాక్యుమెంట్లు నెంబర్ సృష్టించి, డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డి మరియు సబ్-రిజిస్ట్రార్ రెహమాన్ తో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి పలుమార్లు అమ్మినట్లు బయటపడింది. ఈ క్రమంలో ప్లాట్‌కి నఖిలి ఓనర్ గా ధర్మారావు ని సృష్టించి అతను ప్రదీప్ కుమార్ కి, ప్రదీప్ కుమార్ ఆ ప్లాట్ లను రెండుగా విభాజించి ప్రభాకర్, నరేష్ లకి, తరువాత వారిద్దరూ కలిసి గుబ్బల వెంకటేశ్వర్ రావు (GVR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కి రిజిస్ట్రేషన్ చేస్తూ, చివరకు జంగాల శ్రీరామ్ మరియు అతని భార్య విజయలక్ష్మి పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారు.
ఇట్టి కేసు విచారణ లో నిందితులు అందరు ఒక గ్రూప్ గా మారి తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నకిలీ డాకుమెంట్స్ ద్వారా ప్లాట్స్ లను కబ్జా చేసి అమాయకులకి అమ్మి మోసం చేస్తున్నామని నిందితులు ఒప్పుకున్నారు.
ఇట్టి కేసులో తేది: 03 .05.2026 కీసర పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టు లొ హాజరుపరచి, జుడీష్యల్ కస్టడీ కి పంపించడం జరిగినది. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతున్నది.
ఈ కేసు లొ సమగ్ర విచారణ జరిపిన జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయలు, దర్యాప్తు అధికారి యస్ ఐ అనిల్ కుమార్ మరియు కీసర సిబ్బంది ని అభినందించనైనిది.
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >