| Daily భారత్
Logo




ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహంలో నుండి ముగ్గురు బాలికలు అదృశ్యం

News

Posted on 2025-10-09 21:31:49

Share: Share


ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహంలో నుండి ముగ్గురు బాలికలు అదృశ్యం

వారి అదృశ్యం వెనుక హాస్టల్ మహిళా వార్డెన్ నిర్లక్ష్యమే కారణమా..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ సంక్షేమ బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు విద్యార్థినీలు వెళ్లిపోయారు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. ఉదయం హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మి స్థానిక రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో విషయం బహిర్గతమైంది. స్థానిక హాస్టల్ లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో 10వతరగతి చదువుతున్న విద్యార్థిని (15), ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థినీలు (14) గురువారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం ప్రేయర్ (ప్రార్థన) సమయంలో గుర్తించిన అధికారులు ముందుగా బాలికల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తరువాత అధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు వెళ్లిపోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు కౌమార దశ  విద్యార్థినీలు హాస్టల్ నుంచి వెళ్లిపోతుంటే అక్కడ వార్డెన్ పర్యవేక్షణ ఎమిటని చర్చ జరుగుతుంది. అసలు అక్కడ పనిచేస్తున్న వాచ్ మెన్ ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వార్డెన్ తన ఇంట్లో జరుగనున్న వివాహ వేడుకలకు సెలవు పెట్టకుండా స్థానికంగానే రాకపోకలు చేస్తున్నట్లు తెలిసింది. మూడు రోజులలో విందు ఏర్పాట్ల కోసం గురువారం ఉదయం కూడా హస్టల్ లో కూరగాయలు ఇచ్చి వెళ్లిన వార్డెన్ కు ముగ్గురు విద్యార్థినీలు కనిపించకుండా పోయిన విషయం బయటకు పొక్కకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. కేవలం వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఆ ముగ్గురు బాలికలు హాస్టల్ నుండి పారిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళ వాచ్ మెన్ ఉండగా అధికారులు ఎవ్వరు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రార్థన సమయం 7 గంటల వరకు విద్యార్థినీల అద్రుశ్యం వ్యవహారం వెలుగు చూడకపోవడంపై వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణపై చర్చ మొదలైంది. జిల్లా కేంద్రంలోనే అధికారుల పర్యవేక్షణ లేకుంటే మారుమూల ప్రాంతాల హాస్టల్ ల పరిస్థితి ఏమిటనే వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా నగరంలో ముగ్గురు విద్యార్థినీలు కనిపించకుండా పోయిన వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును చేదించడానికి మూడు టీంలను ఏర్పాటు చేసినట్లు నగర సిఐ శ్రీనివాస రాజు తెలిపారు. ఇప్పటికే సాంకేతిక కారణలతో ముగ్గురు విద్యార్థినీలను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. ఉదయం స్థానికంగా సీసీ కెమెరాల వీడియో పుటేజీలను పరిశీలించారు.

Image 1

మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి

Posted On 2025-11-13 10:03:28

Readmore >
Image 1

టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

Posted On 2025-11-12 19:13:27

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి

Posted On 2025-11-12 19:12:07

Readmore >
Image 1

పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం

Posted On 2025-11-12 19:10:42

Readmore >
Image 1

అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు

Posted On 2025-11-12 19:09:07

Readmore >
Image 1

నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?

Posted On 2025-11-12 13:27:18

Readmore >
Image 1

సీఏ లో ఉత్తీర్ణత సాధించిన బొడ్డు సతీష్ ఆత్మీయ సత్కారం

Posted On 2025-11-12 08:51:49

Readmore >
Image 1

JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

Posted On 2025-11-12 08:50:16

Readmore >
Image 1

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి

Posted On 2025-11-12 08:48:19

Readmore >
Image 1

ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Posted On 2025-11-12 08:47:02

Readmore >