Posted on 2025-10-09 19:48:24
గవర్నర్ వద్ద పార్లమెంట్ లో అడ్డుకున్నది బిజెపి అయితే కోర్టులో కేసు వేసి అడ్డుకున్నది బిఆర్ఎస్
42 శాతం రిజర్వేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున తాము బలమైన వాదనాలు వినిపించాం, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇలా మధ్యంతర స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని షబ్బీర్ అలీ అన్నారు. మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. బీసీ 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల సర్వేలు నిర్వహించింది, కృత నిశ్చయంతో వన్ మెన్ కమిషన్ వేసింది. కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది,శాసన సభలో చట్టం చేసి గవర్నర్ కు పంపించామన్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధంగా ఇక్కడ కూడా చేస్తాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, గ్రామాల్లో అభివృద్ధి చేయలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జీవో 9తో ముందుకు వెళుతుంటే కోర్టులో అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరపున కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తుంటే, బీఆర్ ఎస్, బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు. వీరి నాటకాన్ని ప్రజల ముందు ఉంచుతాం బిజెపి, బిఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలకు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. 42 శాతంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. కోర్టులో ఇంకా గట్టిగా వాదన వినిపించి 42 శాతానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >