Posted on 2025-10-09 19:44:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ నిజామాబాద్ జిల్లాలో తొలి విడత ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్ లు జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నవీపేట్, నిజామాబాద్, సిరికొండ జెడ్పీటీసీ స్థానాలతో పాటు, పై మండలాల పరిధిలోని 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపధ్యంలో మోస్రా, చందూర్, రుద్రూర్ మండల కేంద్రాలలోని ఎం.పీ.డీ.ఓ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలు, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారా అని పరిశీలించారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని ఆర్.ఓలకు సూచించారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, స్థానిక అధికారులు ఉన్నారు.
మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
Posted On 2025-11-13 10:03:28
Readmore >
జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి
Posted On 2025-11-12 19:12:07
Readmore >
పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం
Posted On 2025-11-12 19:10:42
Readmore >
అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు
Posted On 2025-11-12 19:09:07
Readmore >
నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?
Posted On 2025-11-12 13:27:18
Readmore >
JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం
Posted On 2025-11-12 08:50:16
Readmore >
ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
Posted On 2025-11-12 08:47:02
Readmore >