| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అవసరం ఉన్నవారికి అవయవ శరీర దానం చేయడమే తమ లక్ష్యం

అవసరం ఉన్నవారికి అవయవ శరీర దానం చేయడమే తమ లక్ష్యం

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మృతి చెందిన వారి నుండి తమ సంస్థ 2013 నేత్రాలు సేకరించి కండ్లు లేని వారికి దానం చేశాం..

అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర లింగం శారద వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని సుభాష్ నగర్ లో గల తెలంగాణ ఆల్ పెన్షనర్స్ భవన్ లో ఏర్పాటుచేసిన అవయవదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మ ఐ ఆర్గాన్, బాడీ డొనేషన్ ప్రసాద్ ఉమ్మడి రాష్టల వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వర లింగం శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తమ సంఘం 2016లో ఎన్జీవో సంస్థ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు తమ సంఘం ద్వారా కళ్ళులేని వారికి మరణించిన వ్యక్తుల నుండి వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు వారి కళ్ళను తీసుకోవడం జరిగిందని ఇలా తీసుకొని 2013 మందికి కంటి చూపును అందించామని ఆయన అన్నారు. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి 12 కిడ్నీలు, ఆరు కాలేయాలు, ఒక గుండెను తెలంగాణ జీవన్దాన్ ద్వారా పేషెంట్లకు అవయవ మార్పిడి చేయడం జరిగిందన్నారు. అలాగే 227 పార్దివదేహాలను మృతుల బంధువుల అంగీకారం మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేయడం జరిగిందన్నారు. అలాగే రెండు చర్మదానాలు, చేశామన్నారు అవగాహన సదస్సులు రెండు రాష్ట్రాల్లో నిర్వహించామన్నారు జనవిజ్ఞాన వేదిక, ఆల్ పెన్షనర్స్  రిటైర్డ్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించటానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు తెలంగాణ ఆల్ రిటైర్డ్ అసోసియేషన్ వివాహకులు రామ్మోహన్ రావు, ఈవీఎల్ నారాయణ, శిర్ప హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.

Previous కొమరం భీమ్ వర్ధంతి సంబర్భంగా దమ్మపేటలో ఘనంగా నివాళి
Next ప్రజాస్వామ్యానికి దొంగఓట్లు గొడ్డలి పెట్టు : మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ADVERTISEMENT