Posted on 2025-10-07 16:31:18
ఆకులమైలారంలో సంతకాల సేకరణలో కిచ్చెన్న
రాజ్యాంగం, రిజర్వేషన్లపై బీజేపీ దాడి చేస్తోంది
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాల ఓట్లను బీజేపీ ఈసీ తొలగిస్తూ,కుట్రలకు పాల్పడుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు.మంగళవారం కందుకూరు మండలం ఆకులమైలారంలో ఓట్ల చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎల్ఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై దాడి చేయటం ఈసీతో కుమ్మక్కు అయి అర్హుల ఓట్లను తొలగిస్తున్నారని లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.కులం, మతం ఆధారంగా ఓట్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నట్లు కేఎల్ఆర్ గుర్తు చేశారు.బీఆర్ఎస్ హయాంలో జల్ పల్లి మున్సిపాలిటీలో వేలాది దొంగఓట్లు నమోదు చేశారని కిచ్చెన్న ఆరోపించారు.అర్హుల ఓట్లు తొలగించినా... బయట వ్యక్తుల ఓట్లు నమోదు చేసినా... ఉద్యమించాలని మహేశ్వరం నియోజకవర్గం పిలుపునిచ్చారు.
రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని అంతం చేయాలని బీజేపీ చూస్తుందని కేఎల్ఆర్ విమర్శించారు. ప్రతీ బూత్ స్థాయిలో వంద సంతకాలు పెట్టించి ఈసీకి నిరసన తెలపాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు.
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >