| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు: సిపి సజ్జనార్

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు: సిపి సజ్జనార్

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోమవారం హైదరాబాద్ కమిషనర్ రేట్ పరిధిలోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థ పనితీరు, పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

తనిఖీలో భాగంగా స్టేషన్ రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, క్రైమ్ డీటైల్స్‌ను సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. బాధితులకు న్యాయం జరిగేలా పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. తనిఖీ అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమైన సీపీ మాట్లాడుతూ.

పోలీసింగ్ అంటే కేవలం చట్ట అమలు చేయడమే కాదు ప్రజలతో నమ్మకం కలిగించే విధంగా పనిచేయ డమే నిజమైన సేవని తెలిపారు. పారదర్శకత, క్రమశిక్షణ, సత్సంబంధాలు పోలీసుల ప్రతిష్ఠను పెంచుతాయని స్పష్టం చేశారు.

సుదీర్ఘ విరామం తర్వాత యూనిఫాం వేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా  బాధ్యతలు చేపట్టి తమ దైన మార్క్‌ను చూపించడం ప్రారంభించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడేవారికి స్ట్రాంగ్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. 

తాజాగా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో మందుబాబు లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత నాలుగేళ్లుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్.. ఇప్పుడు సీపీగా చార్జ్ తీసుకొని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు.మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపుతామని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Previous నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Next దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు, 5000 రూపాయల జరిమానా
ADVERTISEMENT