Posted on 2024-01-01 14:07:36
డైలీ భారత్, బేస్తవారపేట: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్(20), శ్రీనివాస్(21), రాహుల్(21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు..
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >