Posted on 2025-09-29 12:07:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని సోమవారం నిజామాబాద్ నగరంలోని ఫ్రూడెన్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తిరుమల టాకీస్ చౌరస్తా, ఖలీల్ వాడి మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు డోంట్ మిస్ ఏ బీత్ అనే తీమ్ తో ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తమ ఆసుపత్రి వైద్యులతో సహా సిబ్బంది నిజామాబాద్ లోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి హార్ట్ సమస్యలపై అవగాహన నిర్వహించామని తెలిపారు. ఈమధ్య కాలంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుండెనొప్పి సమస్యలతో అధికంగా కేసులు నమోదవుతున్నాయని ఇది చాలా బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య ఆహార అలవాట్లను మార్చుకుంటే సక్రమంగా నిర్వహిస్తే గుండె నొప్పిని శాశ్వతంగా దూరం పెట్టవచ్చని ఆయన అన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ పరంగా గానో, లేదా ఇంటి సమస్యలు ఉన్నవారికి ఎక్కువగా పని ఒత్తిడి వల్ల గుండెపై భారం పెరిగి గుండె నొప్పితో ఆస్పత్రుల బారిన పడి సమస్యలు కొనితెచ్చుకుంటారని వీటిని శాశ్వతంగా దూరం పెట్టాలంటే ప్రతి మనిషి రోజుకు ఒక గంట సమయం వ్యాయామం, వాకింగ్ లాంటివి చేస్తే ఈ సమస్య నుండి దూరం పెట్టవచ్చని ఆయన అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ భైరవనాథ్, డాక్టర్ కిరణ్ రావు, డాక్టర్ రవి జక్క, డాక్టర్ శ్రావ్య, డాక్టర్స్ డాక్టర్ శాంతి సింగ్, ఆస్పత్రి ఉద్యోగులు నరేష్, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >