| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరంగల్ లో ఆరుగురు చిన్నారులకు కోవిడ్

వరంగల్ లో ఆరుగురు చిన్నారులకు కోవిడ్

డైలీ భారత్,  వరంగల్: వరంగల్‌ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తు న్నది. వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయ్యింది.

దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు.ఆయా చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్స అంద జేస్తున్నారు.

నగరానికి చెందిన ఆరుగురు చిన్నారులకు కొవిడ్‌ లక్షణా లు కనిపించాయి.దీంతో కాకతీయ మెడికల్‌ కాలేజీ లోని వైరాలజీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.

ఇటీవల నీలోఫర్‌ ఆసు పత్రిలో ముగ్గురు చిన్నారు లకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి మళ్లీ కలవ రానికి గురి చేస్తున్నది.

ఇటీవల రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇందులో చిన్నారు లు సైతం ఉండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవు తున్నాయి

Previous విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమాలు,సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలి.ట్రాఫిక్ ఆర్.ఎస్ రాజు.
Next కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ADVERTISEMENT