| Daily భారత్
Logo




మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి శక్తి వాంఛనగా కృషి చేస్తా

News

Posted on 2025-09-19 13:21:44

Share: Share


మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి శక్తి వాంఛనగా కృషి చేస్తా

మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలల తీర్చిదిద్దుతా..

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి తెరల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చాయ్ అమ్ముకునే స్థాయి నుండి దేశప్రధానిగా ఎదిగి భారతదేశన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మోదీగారిని భావి తరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆడబిడ్డ పుట్టిననాటి నుండి విద్య, వైద్యం, పెళ్లి చేసుకునే వరకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి విద్య, ఉపాధిలో అవకాశాలు కల్పించడం చరిత్రత్మక నిర్ణయం అన్నారు. అగ్రవర్ణ పేద కుటుంబాలు అన్ని బిజెపి ప్రభుత్వానికి రుణపడి ఉన్నారని తెలిపారు. మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తాని అన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతుల ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. వినయం, విధేయత, విద్యకు  మారుపేరుగా ప్రఖ్యాతలు కలిగిన మాణిక్ భవన్ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం 800 నోట్ పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు ఎమ్మెల్యే  పంపిణి చేశారు.


కార్యక్రమంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్, మాణిక్ భవన్ పాఠశాల అధ్యక్షులు ఇంగు శివ ప్రసాద్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల ప్రభాకర్, క్యాషియర్ గాలి నాగరాజు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు మాణిక్ భవన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.


Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >