Posted on 2025-09-11 15:44:35
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఇతర పార్టీ లోకి వెళ్తారా.. ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలి గా అనుబంధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఆమె జాగృతిని రాజకీయ పార్టీగా స్థాపించి ఇన్నాళ్లు తెలంగాణ జాగృతి కమిటీగా వ్యవహరించిన నాయకులను ఆమె స్థాపించే తెలంగాణ జాగృతి నేతలను తాను కొత్తగా పెట్టబోయే పార్టీలోకి ఆహ్వానించి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా వ్యూహం రచించనున్నారా అనే సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆమె అభిమానులు అనుచరులు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కవిత వీరాభిమాని బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అదే దారిలో ఇంకొంతమంది ఉన్నారా అనే సందేహం నెలకొంటుంది. ఇది ఇలా ఉండగా పార్టీ నుంచి గెలిచిన వారే పార్టీకి రాజీనామా చేసి కవితకు మద్దతు తెలుపుతుంటే తెలంగాణ జాగృతి నిజామాబాద్ శాఖ మాత్రం ఆమె సస్పెండ్ అయిన నాటి నుండి నోరుమెడపకుండా ఉండటం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్టీ నేతల కంటే తెలంగాణ జాగృతి నాయకులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు ముఖ్యంగా నిజామాబాద్ తెలంగాణ జాగృతి నాయకులకు అతి దగ్గరగా వారు ఎలాంటి సమస్యలున్న దగ్గరుండి పరిష్కరించే విధంగా కృషి చేశారు. కానీ తాజా రాజకీయ పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో కవిత సస్పెండ్ చేసిన ఆ పార్టీ అధినాయకత్వం పై కనీసం ఖండించకుండా రాజకీయ విశ్లేషకులు కవిత అభిమానులు, అనుచరులు చర్చించుకుంటున్నారు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టైనా సరే తాము పార్టీ వైపే ఉంటమో లేదా మాజీ ఎంపీ కవిత వైపే ఆమెకు మద్దతుగా ఉంటామో నని చెప్పలేని పరిస్థితి నిజామాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి నాయకుల పరిస్థితి. ఎలా అంటే ముందు నుయ్యి, వెనక గొయ్యి అనే పరిస్థితి తయారయింది జిల్లా తెలంగాణ జాగృతి నాయకుల పరిస్థితి.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >
అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Posted On 2026-08-27 15:58:53
Readmore >
"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Posted On 2026-08-27 15:50:17
Readmore >