| Daily భారత్
Logo




విద్యా రంగంలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం

News

Posted on 2025-09-09 20:48:08

Share: Share


విద్యా రంగంలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం

గురుపూజోత్సవంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు 

పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ నిజామాబాద్ జిల్లాను విద్యా రంగంలో అగ్రభాగాన నిలుపుదామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గురుపూజోత్సవం నిర్వహించారు. జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి గురుపూజోత్సవానికి శ్రీకారం చుట్టిన మీదట, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 40 మంది ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్ధ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మ ఆదర్శ పాటశాల కమిటీల ద్వారా కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో 10 శాతం వరకు నిధులు రూ. 22 వేల కోట్లను విద్యా రంగానికి కేటాయించారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, మౌలిక వసతుల పెంపు, కొత్త డైట్ మెనూ అమలు వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు. దీనిని గుర్తించిన అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులలలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అన్ని పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ప్రభుత్వ బడులలో ఆంగ్ల మాధ్యమ బోధనతో పాటు ప్రీ-స్కూల్స్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని తెలిపారు. మార్కులు, ర్యాంకుల ప్రాతిపదికన కాకుండా దేశానికి భావిభారత పౌరులను అందించే సంకల్పంతో విద్యార్థులకు ఆయా సబ్జెక్టులతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ధ్యానం, యోగా వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సులభంగా విద్యార్థులు ఆకళింపు చేసుకునే రీతిలో ఆధునిక పద్ధతుల్లో బోధన చేయాలని హితవు పలికారు.  

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు ఆధునిక, సాంకేతిక విద్యను అందిస్తూ, విద్యా శాఖ ఔన్నత్యాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. సమాజ ప్రగతి, నడవడిక ఉపాధ్యాయుల పైనే ఆధారపడి ఉంటుందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఉపాధ్యాయుడు తమ విధులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అన్నారు. జిల్లాలో విద్యా రంగం పనితీరు ఎంతో సంతృప్తికరంగా ఉందని, ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ బడులు పోటీ పడుతున్నాయని ప్రశంసించారు. అయితే, గతేడాది సాధించిన ఫలితాల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు నమోదు చేసేలా నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని, వార్షిక పరీక్షలకు కనీసం ఆరు మాసాల ముందు నుండే నిర్దిష్ట ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ తో పోలిస్తే ప్రభుత్వ బడులలోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, క్రీడా మైదానాలు, సరిపడా తరగతి గదులు, ఆహ్లాదకర వాతావరణం, అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇంకనూ అవసరమైన బడులలో వసతుల మెరుగు కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 42 కోట్ల నిధులను కేటాయించిందని, సదుపాయాల కల్పన కోసం వీటిని వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని హితవు పలికారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులపై, చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, ట్రిపుల్ ఐ.టీ, ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశాలు పొందేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు. అలాగే అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని, అందుకే ప్రభుత్వం విద్యా హక్కుకు చట్టబద్ధత కల్పించిందని గుర్తు చేశారు. విద్యారంగంతోనే సమాజ ప్రగతి, అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంటాయని అన్నారు. దీనిని గుర్తిస్తూ, విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని, బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, అధునాతన శాస్త్ర, సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త పద్ధతుల్లో విద్యను బోధించేలా ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు నిత్య విద్యార్ధిగా కృషి చేయాలని అన్నారు. కృత్రిమ మేధ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయులనుఘనంగా సత్కరించారు. సీతయ్య, నాగజ్యోతి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు .


Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >