| Daily భారత్
Logo




ఇటీవల నగరపాలక సంస్థ రెవిన్యూ విభాగం ఆర్ ఐ ఏసీబీ చిక్కిన నేపథ్యంలో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్

News

Posted on 2025-09-09 17:52:58

Share: Share


ఇటీవల నగరపాలక సంస్థ రెవిన్యూ విభాగం ఆర్ ఐ ఏసీబీ చిక్కిన నేపథ్యంలో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏ ఒక్క ఉద్యోగి అవినీతికి పాల్పడిన ఉపేక్షించేది లేదు..

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం పని తీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రెవెన్యూ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై పన్ను వసూళ్లలో ప్రగతి, న్యూ అసెస్ మెంట్, మ్యుటేషన్ దరఖాస్తుల ఫైళ్లను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి పలు మ్యుటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు.

సత్వరమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగర పాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్ సూచించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్దీకరణ, ఎల్.ఆర్.ఎస్, ఇంజనీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. సమీక్షా సమావేశం నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదన కమిషనర్ రవిబాబు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >