Posted on 2025-09-08 18:12:51
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్‌లో భారీ మొత్తంలో నోట్లు పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురి వద్ద ఉన్న 3 బ్యాగుల్లోని రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నోట్లు అన్ని రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు.
మూడు బ్యాగులలో భారీ మొత్తంలో నోట్లు ఉన్నట్లు ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆటో డ్రైవర్ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణగూడలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 3 బ్యాగుల్లో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు నిందితులను తరలించారు. 2016లో పెద్ద నోట్లు రద్దు కాగా.. 9 ఏళ్ల తర్వాత పట్టుబడడం అందరిని షాక్‌కు గురిచేసింది. రద్దయిన నోట్లను ఏం చేయడానికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >