Posted on 2025-09-03 17:28:11
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ, ఆధ్వర్యంలో జిల్లా బాల్ భవన్లో బుధవారం కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లాస్థాయి కళా ఉత్సవ్ సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు రోజులు సాగే ఈ పోటీలలో గ్రూప్ డాన్స్, సోలో డాన్స్ ,గ్రూప్ సాంగ్స్, సోలో సాంగ్, ఇన్స్ట్రుమెంటల్ ,స్కిట్ ,2డి ,3డి డ్రాయింగ్ మొదలైన పోటీలు విద్యార్థులకు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులంతా ఈ కళా ఉత్సవంలో చైతన్యవంతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులను సంసిద్ధులను చేసి తీసుకొచ్చిన ఉపాధ్యాయులను డీఈవో ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఎమ్ఓ బాలకృష్ణారావు, నిజాంబాద్ అర్బన్ ఎంఈఓ సాయి రెడ్డి, జూరీ కమిటీ మెంబర్స్ లక్ష్మీనాథం ఆర్. గోపాలకృష్ణ ,కాసర్ల నరేష్ రావు ,లక్ష్మణ్, చింతల శ్రీనివాస్, డాక్టర్ శారద న్యాయ నిర్ణేతలు ఉమాబాల, స్వప్న రాణి, జయలక్ష్మి, పాయల్, గంట్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >