| Daily భారత్
Logo




ఒకే ఏడాదిలో ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

News

Posted on 2025-09-03 13:53:39

Share: Share


ఒకే ఏడాదిలో ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

అవినీతికి అడ్డాగా నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం అవినీతికి అడ్డాగా  మారింది. ఏడాది కాలంలోనే ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. గత సంవత్సరం ఆగస్టు మాసంలో నగరపాలక సంస్థల పనిచేసే ఆర్ఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. తో పాటు కోట్లాది రూపాయల నగదు పాటు ఆస్తుల కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే విభాగంలోని ఇంచార్జ్ రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రావు 7000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ నుండి ఖాళీ స్థలం టాక్స్ చెల్లింపుల కోసం వచ్చిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ నుండి 10000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డిఎస్పి లక్ష్మీ కాంత్ రెడ్డి వెల్లడించారు. 10000 డిమాండ్ చేయగా 7000 రూపాయలు ఇచ్చేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ అధికారుల వ్యూహంలో భాగంగా బుధవారం నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని రెవిన్యూ విభాగంలో ఇంచార్జ్ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రావు బాధితుడు నుండి లంచం డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుండి 7000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఇది ఇలా ఉండగా బోధన్ ప్రాంతానికి చెందిన ఆర్ ఐ శ్రీనివాసరావు 2001 సంవత్సరంలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తూ అప్పట్లో ఏసీబీకి చిక్కారు. ఓ కిరానా కొట్టుకు సంబంధించి టాక్స్ తగ్గించేందుకు ₹1000 డిమాండ్ చేయగా విషయం తెలుసుకున్న అప్పటి ఏసీబీ అధికారులు కిరాణా దుకాణంలో లంచం తీసుకుంటుండగా ఆయనను పట్టుకున్నారు. తాజాగా నిజామాబాద్ లో 7000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుకోవడం  రెండవసారి.

Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >