| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చంద్రగ్రహణం సందర్భంగా రాజన్న ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా రాజన్న ఆలయం మూసివేత

డైలీ భారత్, వేములవాడ:ఈనెల తేదీ 07-09-2025 (ఆదివారం) నాడు సంభవించనున్న చంద్రగ్రహణం నేపధ్యంలో, ఉదయం 11:25 గంటల వరకు మాత్రమే ఆలయ సేవలు నిర్వహించబడతాయని ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం శ్రీ స్వామివారి ఆలయం మరియు అనుబంధ ఆలయాలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. చంద్రగ్రహణం అనంతరం, తేది 08-09-2025 (సోమవారం) ఉదయం 3:45 గంటల నుండి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టబడుతుంది. తదుపరి మంగళవాయిద్యాల నడుమ సుప్రభాతం, ప్రాతఃకాల పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఆలయం తిరిగి తెరచబడుతుంది. ఆ తరువాత అన్ని నిత్యపూజా కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయని ఆలయ నిర్వాహణాధికారి తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, తమ దర్శన కార్యక్రమాలను తగినవిధంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.

Previous ఈ నెల 5 వ తేదీన జీపీఓలకు నియామకపత్రాలు జారీ : సీసీఎల్ఏ లోకేష్ కుమార్
Next ఒకే ఏడాదిలో ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప
ADVERTISEMENT