| Daily భారత్
Logo




పాతూరికి రాష్ట్ర "కీర్తి" కిరీటం

News

Posted on 2025-09-03 17:38:32

Share: Share


పాతూరికి రాష్ట్ర  "కీర్తి" కిరీటం

డైలీ భారత్, హైదరాబాద్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందుకున్నారు. నేడు హైదరాబాద్ లో జరిగిన   పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో బుర్ర వెంకటేశం చైర్మన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ నిత్యానందరావు చేతుల మీదుగా అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పాతూరి మహేందర్ రెడ్డి. సిరిసిల్ల పట్టణములోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలలో ఆంగ్లం ఉపాధ్యాయులు పనిచేస్తున్న మహేందర్ రెడ్డి1996లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. 

పని చేసిన ప్రతి పాఠశాలలో అంకితభావంతో పనిచేసి విద్యార్థుల సంఖ్యను పెంచారు.  పాఠశాల  మౌళిక వసతుల పట్ల శ్రద్ధను చూపి విరాళాలు సేకరించి విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేసి పాఠశాలను  తీర్చిదిద్దారు. పాఠశాలకు  స్వయంగా ఆర్ధిక వనరులను అందించి  పిల్లలను ప్రోత్సహించి వారిలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపే ఉద్దేశంతో తన తండ్రి పేరు మీద పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్,సిల్వర్ మెడల్స్ అందించేవారు.

 విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించేవారు. బాల సభ,ఇంకుడు గుంతల నిర్మాణం , కిచెన్ గార్డెన్ సేంద్ర్రేయ ఎరువుల తయారీ, పాఠశాల సుందరీకరణ మొదలగు కార్యక్రమాలను పిల్లల చేత చేయించేవారు. తన బోధనా సబ్జెక్ట్ లో ప్రతి సంవత్సరం 100% పలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి ప్రత్యేక తరగతులను తీసుకునేవారు.

పాఠశాలలో పిల్లలకు వినూత్న కార్యక్రమాలను పరిచయం చేస్తూ చదవడమే కాకుండా విద్యార్థులలో మానవతా విలువలను మంచి లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో నిజాయితి దుకాణం, మానవత్వపు గోడ ,పెన్ బ్యాంకులను పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టి పిల్లలను ప్రోత్సహించేవారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పాఠశాలలో వాటిని ప్రవేశపెట్టి  ప్రత్యెక వెబ్సైటు, బల్క SMS సిస్టం  నిర్వహణ మొదలగు కార్యక్రమాలను నిర్వహించేవారు.

పాఠశాల కార్యక్రమాల్లో భాగంగా బడిబాట,హరిత హారం ప్రచార రథాలు , వన విజ్ఞానం,డిజిటల్ విద్యా భోధన మొదలగు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అమలు చేసారు.

కరోనా సమయంలో ఖాళీగా కూర్చోక ఆన్లైన్ కోర్సులు రాసి రాష్టంలో అత్యదికంగా 1791 ప్రశంశా పత్రాలు అందుకని రికార్డును సృష్టించారు.

ఉపాధ్యాయుడిగా 29 సంవత్సరాల ఆయన అకుంఠిత దీక్షకు అంకిత భావానికి గుర్తుగా జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డ్, స్వచ్చ విద్యాలయ రాష్ట్ర అవార్డు,టూటర్స్ ప్రైడ్ ఐడియల్ టీచర్ రాష్ట అవార్డ్,రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయ అవార్డ్,అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు,నేషనల్ ఇంటిగ్రటేడ్ అవార్డ్, రాష్ట్ర గురుబ్రహ్మ అవార్డు, విద్యా బూషణ్ రాష్ర్ట అవార్డు, సేవారత్న రాష్ట్ర స్థాయి అవార్డ్, వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ గోల్డ్ మెడల్, సావిత్రిబాయి పులే విశిష్ట సేవా పురస్కారం, కరోనా వారియర్ రాష్ట్ర స్థాయి పురస్కారం, గ్లోబల్ టీచర్ అవార్డు, విశ్వగురు ఇంటర్నేషనల్ అవార్డు, ప్రైడ్ అఫ్ ఇండియా నంది అవార్డు, ఎక్సుక్లుసివ్ వరల్డ్ రికార్డు అవార్డు, విద్యారత్న జాతీయ పురస్కారం మొదలగు అనేక అవార్డులను అందుకున్నారు.


Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >
Image 1

బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

Posted On 2026-05-04 08:54:09

Readmore >
Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >