| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి ప్రత్యేక పూజలు

ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి ప్రత్యేక పూజలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా కుంకుమ పూజ నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. మంగళవారం నాటి పూజలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.


Previous ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు
Next సంస్కార భారతి ఆద్వర్యంలో ప్రెస్ క్లబ్ గణేష్ మండలికి పురస్కారం
ADVERTISEMENT