| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిజెపి పార్టీ కార్యాలయం జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి

బిజెపి పార్టీ కార్యాలయం జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 79 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్రం కోసం అసువులు బాసిన వీరులకు ఈ సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడు స్మరించుకోవాల్సిన  అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే భారతదేశంలో అక్రమంగా చొరబడుతున్న దేశద్రోహులను వారి ఆగడాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దేశంలో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాదుల దాడులు జరగకుండా తిప్పికొడుతున్నామని ఎందుకు ఉదాహరణనే ఇటీవల పహల్గాం లో ఉగ్రవాదుల ఏరివేతకు ఉగ్రవాదుల ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రధానమంత్రి మోడీ చేపట్టిన కార్యక్రమం ప్రపంచంలోనే అగ్ర దేశాలు ప్రధాని మోడీ, అలాగే భారతదేశ సైనికుల సత్తా ఏంటో చాటి చెప్పడం జరిగిందన్నారు. ఇది మన దేశం యొక్క గొప్పతనానికి నిదర్శనం అన్నారు.

Previous ఎన్డీసీసీబీ బ్యాంకులో జాతీయ జెండా ఆవిష్కరణ
Next కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ
ADVERTISEMENT