Posted on 2025-08-15 08:10:42
స్వాతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ గా దేశం అభివృద్ధి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నాం అన్నారు. గుండె నిండా దేశభక్తి కలిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యువత దేశానికి కావాలన్నారు,విద్యార్థి దశనుండే పిల్లల్లో దేశభక్తి, మహనీయుల స్ఫూర్తిని నింపాలన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తు కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయి ప్రజలకు చేరవేస్తూ కూడు,గూడు, గుడ్డ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ ను పర్యాటక రంగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తు ఒకే దేశంలో రెండు రాజ్యాంగలు చెల్లవని ఒక దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలని అమలులో తెచ్చిన ఘనత మోదీది అన్నారు.
పహాల్ గామ్ ఘటనతో ప్రతి భారతీయునిలో మరిగిన రక్తనికి ఆపరేషన్ సిందూర్ ఘన విజయం గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఖలిల్వాడిలోని సన్రైజ్ హాస్పిటల్లో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్య వైద్యం అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వైద్యంలో హాస్పిటల్ యాజమాన్యం పేద రోగులకు అలాగే మెరుగైన వైద్యాన్ని అందిస్తూ కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు.
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >
మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Posted On 2026-07-29 08:51:28
Readmore >
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >