| Daily భారత్
Logo




జ్యువెలరీ షాప్ యజమానులు తమ దుకాణాలు మరియు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసుకోవాలి

News

Posted on 2025-08-13 16:31:29

Share: Share


జ్యువెలరీ షాప్ యజమానులు తమ దుకాణాలు మరియు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసుకోవాలి

తమ వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి  : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

జిల్లా వ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ వ్యాపారస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేసిన  జిల్లా ఎస్పీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్  ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్న జ్యువెలరీ షాప్ యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని కొత్తగూడెం పట్టణంలోని IMA ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గల జ్యువెలరీ షాపుల యజమానులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వారికి పలు సూచనలు చేశారు.బంగారు నగల దుకాణాల యజమానులు వారి దుకాణాలలో మరియు పరిసర ప్రాంతాల్లో పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని తెలిపారు.దొంగతనాలకు పాల్పడిన నిందితుల వద్ద నుండి ఆభరణాలను కొనుగోలు చేయకూడదని,ఎవరైనా దొంగసొత్తును కొనుగోలు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.వ్యాపారస్తులు దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి పోలీసు వారు సూచనలను పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బంగారు నగలు వ్యాపారస్తులు తమ దుకాణాల పరిసరాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.తమ తమ దుకాణాలలో పనిచేసే వ్యక్తుల గురించి,వారి ప్రవర్తన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే వారిని పనిలో పెట్టుకోవాలని సూచించారు.తమ దుకాణాల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి కదలికలపై కూడా సరైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను తమ దుకాణాలలో ఉంచవలసి వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.తమ వ్యాపార సముదాయాల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో గస్తీని పెంచుకోవాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన పలు దొంగతనాల కేసుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా మరియు పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఆధారంగా నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేకూర్చడం జరిగిందని అన్నారు.దొంగతనాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పోలీసు వారికి సహకరించాలని కోరారు.అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న బంగారు నగల దుకాణాల యజమానుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పి చంద్ర భాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీసిఎస్ సీఐ రమాకాంత్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, కొత్తగూడెం 2టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, 1టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,3టౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >