పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలి
కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో అధికారులు పారిశుధ్యం పై దృష్టి సారించాలని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ సుజాతను కలిసి వినతి పత్రం ఇచ్చారు. శానిటేషన్ అధికారులు నిద్రమత్తు విడాలని చెప్పారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆవులు సంచరిస్తూ.. రోడ్లపై బైఠాయిస్తూ.. వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ లోపం కారణంగా దుర్గంధం వెదజల్లుతున్నాయని, పారిశుద్ధ్య అధికారుల పట్టింపు లేదని చెప్పారు. సీజనల్ వ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పొగను మరియు దోమల మందు పిచికారి చేయాలన్నారు. గతంలో నిధులు మంజూరై ప్రారంభమైన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇంజనీరింగ్ విభాగ అధికారులు పెండింగ్ పనుల పై దృష్టి పెట్టాలని, పెండింగ్ పనులను ఆయా కాంట్రాక్టర్లు పూర్తి చేయాలన్నారు. డివైడర్ మధ్యలో పెరిగిన కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని, శానిటేషన్ కార్మికులకు వెంటనే రైన్ కోట్లు అందించాలి, సంటేషన్ కార్మికులకు అందవలసిన సబ్బులు నూనెలను వెంటనే అందించాలి. కోతులు, కుక్కల వెంటనే పట్టించి వాటి బెడద నుంచి నగర ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.