Posted on 2025-08-11 18:23:33
గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో అవినీతి.
ప్రాథమిక సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత ప్రభుత్వంలో కెసిఆర్ చేపట్టిన పథకాలు అన్నింటిలో అవినీతి ఉందని, కెసిఆర్ కుటుంబం మొత్తం త్వరలో జైలుకు వెళుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ ఆయంలో అప్పుల పాలు చేసిందని, వారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతి జరిగిందని, ప్రతి పథకంలో ఎంక్వయిరీ జరుగుతుందని అన్నారు, త్వరలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళుతుందని, టిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని, అందులో ఉన్న నాయకులు బిజెపి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు, ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకొని రోడ్ల పైన ధర్నాలు చేస్తుందని, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, కెసిఆర్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. బిజెపి పాలిస్తున్న 15 రాష్ట్రాలలో సన్నబియ్యం పథకం లేదని, మరి బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో సమ బియ్యం పథకం ఎందుకు పెట్టలేదని అన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్ అరవింద్ ఈటెల 42 శాతం బీసీ రిజర్వేషన్కు అనుకూలమా, వ్యతిరేకమ బీసీ కు చెప్పాలని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బీసీ లో ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. బిజెపి వాళ్లు గ్రామాల్లోకి వస్తే బీసీ రిజర్వేషన్కు అనుకూలమా వ్యతిరేకమని నిలదీయండి అని అన్నారు. ఒక్క పేదవాడికి కూడా ఒక ఎకరం భూమి గానీ, ఇల్లు కూడా గాని, ఇవ్వలేదని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ వారి పబ్బం కడుక్కున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలియజేయాలని ప్రతి ఒక్క కార్యకర్తపై బాధ్యత ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత 200 యూనిట్ల విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా, బోనస్,ఉచిత బస్సు ప్రయాణం, 500 కే వంట గ్యాస్, 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్ వంటి పథకాలు మహిళ కోసం ఏర్పాటు చేసిందని అన్నారు. నల్లవెల్లి గ్రామంలో ఇప్పటివరకు సిసి రోడ్లు, బ్రిడ్జ్ సాంక్షన్, చెక్ డ్యాములు, ఇందిరమ్మ ఇండ్లు, ఇచ్చామని అన్నారు. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే ఇంకో 50 వరకు కేటాయిస్తానని అన్నారు. నల్లవెల్లి గ్రామంలో మూడు సంవత్సరాల ఒక్కరు కూడా ఇల్లు ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని అన్నారు. స్థలం లేని వారికి 75 గజాల స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని అన్నారు. నల్లవెల్లి గ్రామస్తులు నాపైన ఎంతో అభిమానంగా ఉన్నందుకు చాలా సంతోషమని అన్నారు. నల్లవెల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలలో ఉన్న మహిళలు అకస్మాత్తుగా మరణిస్తే రెండు లక్షల బీమా ఇచ్చామని అన్నారు . అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవాసి ప్రజావాణి ఏర్పాటు చేసిందని మన తెలంగాణ నుంచి గల్ఫ్ వెళ్లిన వారికి ప్రవాసి ప్రజావాణి ఏర్పాటుచేసి గల్ఫ్ లో కష్టాలు ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సహాయం అందిస్తుందని అన్నారు, గల్ఫ్ లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటుందని అన్నారు. ప్రజల పక్షాన పక్షాన పేదల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. నల్లవెల్లి గ్రామానికి సబ్ స్టేషన్, ఎస్బిఐ బ్యాంకు, ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళా సంఘాలకు 10 లక్షలతో భవనం కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. నల్లవెల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మీ అభిమానం నాపై ఇలాగే ఉండాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి నూతనంగా నిర్మించిన ప్రారంభించారు. నల్లవెల్లిలోని ఎల్లమ్మ మందిరానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే తాండాలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం, సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని సందర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్ డి సి సి బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, నల్లవెల్లి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డిచ్పల్లి బ్లాక్ కాంగ్రెస్ కొనసాని శ్రీనివాస్, డిచ్పల్లి సొసైటీ అధ్యక్షులు రామచంద్ర గౌడ్, నల్లవెల్లి సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >