| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 121 మందికి 35,62,000 రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి  పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్ధిక భరోసా లభిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు అనేకమందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించామని, అర్హులైన ప్రతిఒక్కరికీ సహాయం అందేలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందని అన్నారు..

రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి మంగళం పాడిందని అన్నారు మహిళకు 2500,తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Next ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా ఉన్నత అధికారులు తప్పక హాజరు కావాలి
ADVERTISEMENT