| Daily భారత్
Logo




ట్రాఫిక్ రూల్స్ పాటించే వారికి గిఫ్ట్ ప్యాక్

News

Posted on 2025-08-08 04:24:42

Share: Share


ట్రాఫిక్ రూల్స్ పాటించే వారికి గిఫ్ట్ ప్యాక్

మహిళలకు ట్రాఫిక్ పోలీసుల శ్రావణం చీర

డైలీ భారత్, పెద్దపల్లి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడమే కాదు… ఆ నిబంధనలు పాటించే వారిని గౌరవిస్తామని తెలంగాణా ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించిన మహిళా బైక్‌రైడర్లకు ట్రాఫిక్‌ పోలీసులు శ్రావణం చీర కానుక ప్రకటించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్‌ ధరించిన మహిళలకు చీర, జాకెట్‌ అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్‌ ఆఫీస్‌ చౌరస్తా వద్ద గురువారం పోలీసులు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. హెల్మెట్‌ ధరించి.. నిబంధనలకు అనుగుణంగా బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న మహిళలను గుర్తించి చీరలు అందజేసి సత్కరించారు.

ట్రాఫిక్‌ చలాన్లు, డ్రంకెన్‌ డ్రైవ్, రాంగ్‌ పార్కింగ్‌ ఫైన్‌లే కాదు.. నిబంధనలు పాటించే వారిని గుర్తించి గౌరవిస్తామని రామగుండం ఏసీపీ సీహెచ్‌.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. మొదటి దఫాగా పదిమంది మహిళలను గుర్తించి చీరలు అందజేసినట్లు తెలిపారు. భర్త హెల్మెట్‌ తో బైక్‌ నడుపుతుంటే… వెనకాల కూర్చున్న భార్యకు కూడా చీర, జాకెట్‌ అందజేసి… హెల్మెట్‌ పెట్టుకునేలా ప్రోత్సహించాలని ఏసీపీ కోరారు. బట్టల దుకాణాల యజమానుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వివరించారు. గతంలో పూలు అందజేసి అభినందిస్తే చాలామంది బాధపడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలకు చీర, జాకెట్, బైక్‌ నడిపే పురుషులకు ప్యాంట్, షర్ట్‌ దాతల సహకారంతో అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐ హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >