Posted on 2023-12-20 16:18:06
సొంత పార్ట్నర్ లూటీ చేశాడని బాధితుడు ఆవేదన
డైలీ భారత్, సిరిసిల్ల :సొంత పార్ట్నర్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి 26 లక్షలు లూటీ చేశాడని సిరిసిల్ల పట్టణానికి చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు గుగ్గిళ్ళ జగన్ గౌడ్ బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారు. పట్టణంలోని వికాస్ డిగ్రీ, పీజీ కళాశాలలో తనకు 52% భాగస్వామ్యం ఉన్నదని, తనకు తెలియకుండా కళాశాల ప్రిన్సిపల్, బిఆర్ఎస్ నేత దిడ్డి శ్రీనివాస్ తాను పట్టణంలో లేని సమయం చూసి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి 26 లక్షల రూపాయలను లూటీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబరు 10 నుండి అక్టోబర్ 13 వరకు అమెరికాలోని తన కూతురి దగ్గరికి వెళ్లానన్నారు. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ జాయింట్ సంతకం తో కూడిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంటు నుండి 26 లక్షల రూపాయలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేశాడని, అంతేకాకుండా రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఖాతాలో ఐదుగురు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి అకౌంట్ కూడా క్లోజ్ చేశాడన్నారు. బిఆర్ఎస్ నేత ప్రిన్సిపల్ దిడ్డి శ్రీనివాస్ సొసైటీ మెంబర్, సెస్ డైరెక్టర్ దిడ్డి రమ ఇరువురిపై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. సంతకాలు ఫోర్జరీ చేసిన దిడ్డి శ్రీనివాస్ ఆయన భార్య దిడ్డి రమపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని పోలీసు శాఖను జగన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >