| Daily భారత్
Logo




భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు

News

Posted on 2025-07-26 20:36:43

Share: Share


భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు

ఎక్కడ కూడా వర్షాల కారణంగా ప్రాణం నష్టం కలగకుండా అధికారులు పక్కా ప్రణాళికలు తయారు చేసుకోవాలి

శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ పరిధిలో ఉండే గ్రామాలలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి

ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:

గత నాలుగు ఐదు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలలో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతంతో పాటు కాలువలు, చెరువులు, ఇతర జలాశయాలలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా, ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని, కేతస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వరద జలాలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఇదివరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో కొందరు జలదిగ్బంధంలో చిక్కుకున్న సంఘటనలు నెలకొన్నాయని గుర్తు చేస్తూ, అలాంటి ప్రదేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపించేలా చూస్తామని, స్థానిక పరిస్థితుల గురించి జిల్లా యంత్రాంగం ದ್ವಾರಾ ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, భారీ వర్షాల వల్ల వరద పరిస్థితి నెలకొంటే సమర్థవంతంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచే కంటేశ్వర్ రైల్వే కమాన్, ముబారక్ నగర్ వంటి ప్రాంతాల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్థానికులను తరలించేలా పునరావాస కేంద్రాలనుకూడా గుర్తించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ లు, చెరువులలో వచ్చి చేరుతున్న వరద జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న నిజామాబాద్ నగరంలోని 167 ఇళ్ల యజమానులకు ఖాళీ చేయాలని నోటీసులు అందించామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. విష జ్వరాలు ప్రబలిన కాల్పోల్ తండాలో వెంటనే వైద్య శిబిరం నెలకొల్పి, పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, రైతుల్లో భరోసా కల్పించేలా అన్ని విక్రయ కేంద్రాల్లో స్టాక్ వివరాలతో కూడిన బోర్డు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్లియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >