Posted on 2025-07-26 17:03:51
సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ ను రోడ్లపై ఉరికించి కొట్టే రోజులు వస్తాయి
పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప పనులు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ ప్రతి సభలో చెప్పాడని, గతం 2014లో గెలిచిన తర్వాత కెసిఆర్ సిఎం అయ్యాడని, పూర్తిగా దళితులు మోసం చేశారని అన్నారు. కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మరోసారి పునరావృత్తమైతే, ప్రజలు రోడ్లపై ఉరికించి కొట్టే రోజులు వస్తాయని అన్నారు. ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు. మోపాల్ మండలం నర్సింగ్ పల్లి లో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులకు మూడెకరాలు ఇస్తానని కెసిఆర్ మోసం చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గంలో నలుగురికి స్థానం కల్పించిందని, అలాగే అసెంబ్లీ స్పీకర్ చేసిందని అన్నారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఒక దళిత బిడ్డ అని అన్నారు. బిఆర్ఎస్ బిజెపి తోడుదొంగలని, రాష్ట్రానికి నిధులు రాకుండా, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు, పదేండ్ల అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. కవితను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ కు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించిందని, బిజెపి ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంటులోబీజేపీ ఎంపీలు మాట మార్చరని విమర్శించారు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా ఇచ్చి తీరుతామని అన్నారు. పాత డిజైన్ ప్రకారం మంచిప్ప ప్రాజెక్టు పనులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఒప్పుకున్నారని, 15 రోజుల్లో జీవో వస్తుందని త్వరలో జరిగే సీఎం ప్రసంగంలో మంచి ప్రస్తావన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో బిఆర్ఎస్ ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని 18 నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులతో పాటు అనేక పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తుందని బిజెపి వారు చెప్పుకుంటున్నారని,బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారని అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు కూడా చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్ ఎన్ డి సి సి బి వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ లింగన్న, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి గోవిందు రావు, మాజీ ఎంపీపీ యాదగిరి, మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి రెడ్డి, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రాజేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >